తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే యాదాద్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అధునాతన హంగులతో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్స్‌ను , వీవీఐపీ కాటేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
యాదాద్రి ప్రధానాలయానికి ఉత్తరం దిశలోని చిన్న కొండపై 13.2 ఎకరాల విస్తీర్ణంలో 14 విల్లాలు నిర్మించారు. సుమారు రూ రూ.105 కోట్లతో ప్రెసిడెన్షియల్ సూట్స్‌ను నిర్మించారు. వీవీఐపీలు వచ్చి ఉండేందుకు ఇక్కడ ప్రెసిడెన్షియల్ సూట్ ను నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.
ఆలయ మహాసంప్రోక్షణలో భాగంగా వచ్చే నెల 21న నిర్వహించే శ్రీసుదర్శన నారసింహ మహాయాగం ఏర్పాట్లను సీఎం పరిశీలించనున్నారు. 75 ఎకరాల్లో 126 పర్ణశాలల్లో ఒక్కో దాంట్లో ఎనిమిది కుండాలతో నిర్మించిన మహాయాగశాలను సందర్శిస్తారు.
అనంతరం భువనగిరి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్‌తో పాటు జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం రాయగిరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
సీఎం కేసీఆర్ సభకు సుమారు లక్షా పది వేల మంది వస్తారని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్టు సభా స్థలి వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు.
బీజేపీకి టీఆర్ఎస్ చాలాసార్లు మద్దతు: ఉత్తమ్