telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కల్వకుంట్ల కవిత ఫన్నీ ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్

kavitha trs

నిజామాబాద్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ మహిళా నేత కల్వకుంట్ల కవిత ఈ రోజు ఉదయం తన ట్విట్టర్ లో ఓ ఫన్నీ ట్వీట్ షేర్ చేశారు. తన కుమారుడు ఈ ట్వీట్ ను తనకు పంపించాడని ఆమె చెప్పారు. ఇందులో ‘మిస్టర్ బీన్’ చిత్రం కనిపిస్తుండగా, వీకెండ్స్ ను ఉద్దేశించి, దానిపై ఓ కామెంట్ ఉంది.

“నేను ఏమనుకుంటున్నానంటే… వారాంతాలు చైనాలో రూపుదిద్దుకున్నట్టున్నాయి. అందుకే అవి ఎక్కువ కాలం ఉండవు” అన్న కొటేషన్ ఉంది. ఇక ఈ ఫన్నీ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడ్డియాలో వైరల్ అవుతోంది.దీన్ని చూసిన నెటిజన్లు సరదాగా అభిప్రాయాలు పెడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే కవిత, సరదా కబుర్లను తరచుగా పోస్ట్ చేస్తుంటారు.

Related posts