telugu navyamedia
తెలంగాణ వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్ ను దేవస్థానం తరఫున ఘ‌నంగా స‌న్మానం

యాదాద్రిలో లక్ష్మినరసింహస్వామి ఆలయం పునః ప్రారంభమైంది. గర్భాలయంలో సీఎం కేసీఆర్‌ దంపతులు తొలిపూజ చేశారు. వేదమంత్రోచ్చరణల మధ్య మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. అనంతరం నవ్య యాదాద్రిని జాతికి పునరంకితం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

మహోజ్వలఘట్టానికి కారకుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ ను దేవస్థానం తరఫున ఆల‌య ఈవో గీత‌, వైటీడీఏ వైస్‌ ఛైర్మన్‌ కిషన్‌రావు ఘనంగా సన్మానించారు..ఆ త‌రువాత నార‌సింహ స్వామి ఫోటోను బ‌హుక‌రించారు.

 యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయ పునః నిర్మాణ పనుల్లో భాగంగా 2016 ఏప్రిల్‌ 21 నుంచి బాలాలయంలో ప్రతిష్ఠామూర్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి.

అనంతరం “యాదాద్రి- ది సేక్రెడ్​ ఎబోడ్​”.. కాఫీ టేబుల్​ బుక్​ను సీఎం ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్​తో ప్రజాప్రతినిధులంతా ఫొటోలు తీసుకున్న తర్వాత.. యాగశాలలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న బోజనాన్ని స్వీకరించారు. సాయంత్రం ఏడున్నర నుంచి.. శాంతి కళ్యాణం, ఆచార్య, రుత్విక్ సన్మానం, మహదాశీర్వాదం, పరిసమాప్తి ఉంటుంది.

 

Related posts