ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బెట్టింగ్ వెబ్‌సైట్లను బ్యాన్ చేయాలంటూ కేంద్రాని లేఖ రాశారు. కేంద్రంతో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీను ఆ వెబ్‌సైట్లు రాకుండా చేయమని కోరారు. అయితే ఆన్‌టైన్ గేమింగ్, బెట్టింగ్ వంటి అప్లికేషన్లు చాలా వేగంగా పుంజుకుంటున్నాయని, అది యువతకు మంచిది కాదని సీఎం లేఖలో తెలిపారు. అంతేకాకుండా వీటి కారణంగా యువత తప్పుదోవ పట్టే అవకాశాలు అనేకంగా ఉన్నాయని, దానితో పాటు ఆన్‌లైన్ కారణంగా దీనిని నివారించడంలో పోలీసులు విఫలమవుతున్నారని చెప్పారు. అయితే 1974 ఏపీ గేమింగ్ చట్టం ప్రకారం ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ నిషేధమనీ, వాటిని నడుపుతున్న సంస్థలు శిక్షార్హులనీ జగన్ యూనియన్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్‌కు రాసిన లేఖలో వివరించారు. అయితే ఇంటర్నెట్ సంస్థలు సహకరిస్తే దీనిని అడ్డుకోవచ్చని, అందుకు ఐఎస్‌పీ అన్ని ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లను, అప్లికేషన్లను నిలివేయడంలో తోడ్పడాలని కోరారు. అయితే ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ పై చాలా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. పోలీసులు చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు.
previous post
భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు చీకటి దినం: మాజీ సీఎం ముఫ్తీ