telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పుట్టిన రోజు ఓ మంచి నిర్ణయం..

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన పుట్టినరోజున సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అక్కాచెల్లెమ్మలకు పుట్టిన రోజు కానుకను ప్రకటించారు. సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతిరూపం ఇల్లు. గతంలో నివసించే హక్కు స్థానంలో సర్వహక్కులతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నామన్నారు.

26వేల కోట్ల రూపాయల విలువైన 31 లక్షల ఇళ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఈ పథకం కింద దాదాపు రూ.10వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. రూ.6వేల కోట్ల రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ ఛార్జీల మినహాయింపు ఇచ్చామన్నారు. 52లక్షల మందికి ఇచ్చే ఆస్తి విలువ అక్షరాలా రూ.లక్షా 58వేల కోట్లు’ అని సీఎం జగన్‌ సభలో ప్రకటించారు.

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ‘ఇప్పటి వరకు 31లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామనీ. చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా సొంతింటి కల నెరవేర్చామన్నారు. 50 లక్షల మంది కుటుంబాలకు మంచి జరిగే రోజు ఇది. ఇల్లు అంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన కట్టడం కాదు. ఏళ్ల తరబడి కష్టానికి దక్కిన ఫలితంగా… జీవితంలోనిలిచిన సజీవసాక్ష్యమన్నారు.

Related posts