telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ చరిత్రలో ఇంతటి అరాచకాలను ఎప్పుడూ చూడలేదు: చంద్రబాబు

Chandrababu comments Jagan cases

ఏపీ చరిత్రలో ఇంతటి అరాచకాలను ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. దీనికి ఈసీ బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు. శనివారం మధ్యాహ్నం చంద్రబాబుతో సహా 15 మంది టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. రాష్ట్రంలో పోలింగ్‌ జరిగిన తీరు, ఈవీఎంలలో తలెత్తిన లోపాలు తదితర అంశాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. పలుచోట్ల ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని తాము అనుమానిస్తున్నట్టు తెలిపారు.

రెండు రోజులు డిల్లీలోనే ఉంటానని, ఈవీఎంల వ్యవహారాన్ని పలు పార్టీల జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాజ్యాంగ సంస్థలన్నింటినీ దెబ్బతీస్తున్నారని దేశంలోని అన్ని పార్టీలూ వాపోతున్నాయని చెప్పారు. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలోఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేశారని ధ్వజమెత్తారు. దీంతో రాష్ట్రంలో ప్రజాజీవనం స్తంభించిపోయిందన్నారు. ఉదయం నుంచి ఓటర్లు క్యూలైన్లలో ఇబ్బందులు పడ్డారన్నారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ వ్యవస్థాగతంగా వైఫల్యం చెందిందని చంద్రబాబు అన్నారు.

Related posts