ఏపీలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వంలోని 8 శాఖలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి జగన్ సర్కార్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కాలపరిమితిని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.ఇది ఇలా ఉండగా.. నేడు మొదటి విడత సొమ్ము రూ.7500 చొప్పున రైతుల ఖాతాల్లో సీఎం జగన్ లాంఛనంగా విడుదల చేయనున్నారు. తొలివిడతగా రూ 4,003 కోట్లను రైతుల ఖాతాల్లో 7,500 రూపాయల చొప్పున జమ చేయనుంది ప్రభుత్వం.
previous post
next post
గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారు: మంత్రి బొత్స