telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

రెండేళ్లు కాకముందే మూడో మత్స్యకార భరోసా అమలు : జగన్

cm jagan

ఒకవైపు కోవిడ్, మరోవైపు వేట నిషేధ సమయంలో ఈ 1.2 లక్షల కుటుంబాలకు రూ.10వేల చొప్పున సహాయం వారికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అనిసీఎం జగన్ అన్నారు. మత్స్యకారులు గుజరాత్‌ సహా ఇతర రాష్ట్రాలకు వెళ్లి, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ సరిహద్దులకు పోయి ఎందుకు చిక్కుకుపోతున్నారని గతంలో ఆలోచన చేయలేదు. ఈ ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టింది. వీరి జీవనోపాధి పెంచడానికి రాష్ట్రంలో 8 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మించడానికి సన్నద్ధమవుతున్నాం అని తెలిపారు. రెండేళ్ల పాలనా కాకముందే మూడో మత్స్యకార భరోసా అమలు చేస్తున్నం అని జగన్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.10వేల చొప్పున అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇస్తున్నాం. ఈ ఒక్క కార్యక్రమంద్వారా దాదాపుగా రూ.332 కోట్ల రూపాయలు మత్స్యకార కుటుంబాలకు అందించాం. గతంలో మత్స్యకార కుటుంబాలకు పేరుకు మాత్రం ఇస్తామని చెప్పేవారు.. అది ఎవరికి వచ్చేదో తెలియదు, ఎప్పుడు ఇస్తారో, ఏ రోజు ఇస్తారో తెలిసేది కాదు. ఆ ఇచ్చే నాలుగు వేలు కూడా దక్కని పరిస్థితి. వేటకు వెళ్లిన సమయంలో జరగరానిది జరిగితే.. గతంలో ఎప్పుడూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఆక్వా రైతులకు నష్టం రాకుండా… 35 కోట్ల ఇంటిగ్రేటెడ్‌ ల్యాబులను ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు.

Related posts