telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ప్రచార ముగింపులో .. జనసేన కోసం .. చిరంజీవి బహిరంగ సభలు.. !

Janasena pawan kalyan contest two seats

జనసేనలో మెగా ఫ్యామిలిలో ఒకొక్కరు చేరుతున్నారు.. తాజాగా నాగబాబుకు పార్టీ కండువా కప్పి, నర్సాపురం నుండి పోటీలోకి దింపాడు పవన్ కళ్యాణ్. దీనితో ఇక ఉన్నది చిరంజీవి. ఆయనను కూడా పవన్ కు మద్దతుగా నిలబడ్డారనే రాజకీయ నేతలు పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల ప్రచారానికి క్లైమాక్స్ సమయంలో జనసేన సభల్లో చిరు పాల్గొంటారనే టాక్ కూడా వినిపిస్తోంది.

నాగాబాబు కూడా అన్నయ్య ఆశీస్సులతో తమ్ముడి పార్టీ తరుపున లోక్‌సభ టికెట్ అందుకుని బరిలోకి దిగారు. తాను అన్నయ్య పంపితే వచ్చానని, తామంతా తమ్ముడికి అండగా ఉంటామని కూడా నాగబాబు స్పష్టమైన ప్రకటన చేశారు. తన బాబాయ్‌కే మద్దతు ఉంటుందని మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా చాలాసార్లు ప్రకటించాడు. మరోవైపు మెగా అభిమానులందరిని జనసేనకు పని చేయాల్సిందిగా చిరు నుంచి అదేశాలు కూడా వెళ్లాయి. ఇదంతా చూస్తుంటే చిరు కాంగ్రెస్ కు దూరమై, జనసేనకు తనవంతు మద్దతు తెలుపుతారని టాక్ వినిపిస్తోంది.

Related posts