భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఆ భిన్నాలు ఎన్ని ఉన్నాయో లెక్క కష్టం ఏమో కానీ, ఏకత్వం అంటే అది శాంతి మాత్రమే. అందుకే ఈ దేశంలో మహాత్మ గాంధీకి కూడా దేవాలయం కట్టారు. ప్రతి భారతీయుడి గుండెలో చెరుగని ముద్రవేసుకున్న మహాత్ముడి కోసం మంగళూరులో ఏకంగా గుడి కట్టేశారు. ఆయన విగ్రహానికి రోజూ పూజలు అర్పిస్తూ దేవుడిగా కొలుస్తున్నారు. గరోది ప్రాంతంలోని శ్రీ బ్రమ్హా బైదర్ కళాక్షేత్ర ఆలయంలోని ఈ గాంధీ మందిరంలో.. శాంతి, అహింసకు ప్రతిరూపంగా భక్తులు మహాత్ముడిని పూజిస్తున్నారు.
రోజూ భక్తులు గాంధీ విగ్రహం వద్ద టీ, కాఫీ, అరటి పండ్లు ఉంచి ప్రార్థనలు చేస్తారు. గాంధీజీ భక్తుడు ప్రకాష్ గరోడీ రోజూ తెల్లవారుజామున మందిరం పరిసరాలను శుభ్రం చేస్తారు. మహాత్మా గాంధీ తన జీవితంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని, అందుకే మందిరం పరిసరాలను శుభ్రం చేస్తుంటానని అతను తెలిపాడు. గాంధీ టెంపుల్ అందరినీ ఆకర్షిస్తోంది.
ఇమ్రాన్ వ్యాఖ్యలపై భారత్ చురకలు