మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం “గద్దలకొండ గణేష్”. ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ కీలకపాత్రలో నటించగా… పూజాహెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. 14 రీల్స్ ప్లస్ బేనర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన “గద్దలకొండ గణేష్” చిత్రం సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్‌హిట్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. మొదటి నుంచి వాల్మీకి టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు కొన్ని గంటల ముందు “గద్దలకొండ గణేష్”గా టైటిల్ మార్చుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ సినిమాపై ఎలాంటి ప్రభావం పడలేదు సరికదా… గద్దలకొండ గణేష్ గా వరుణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ రోజు (సెప్టెంబర్ 24) “గద్దలకొండ గణేష్” చిత్రాన్ని ప్రత్యేకంగా చూసిన మెగాస్టార్ చిరంజీవి వరుణ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందని, హరీష్ శంకర్ చాలా బాగా తీశాడు, డైలాగ్స్ చాలా బాగున్నాయని అన్నారు. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మాతలు ఈ చిత్రాన్నితీశారని, సినిమాలో టీం స్పిరిట్ కనిపిస్తోందని ఆయన ప్రశంసిస్తూ ఈ అద్భుత విజయాన్ని సాధించిన టీం అందరికీ విజయాభినందనలు తెలిపారు.
previous post
next post
ఈసారి చెంప చెళ్ళుమన్పిస్తా… : చిన్మయి శ్రీపాద