telugu navyamedia
సినిమా వార్తలు

గొప్ప క‌వి ఇక లేరు – చిరంజీవి తీవ్ర భావోద్వేం

టాలీవుడ్ పాట‌ల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గత కొద్ది రోజులుగా న్యూమోనియాతో బాధపడుతూ సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల మరణవార్తతో యావత్ సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. సిరివెన్నెలతో తమకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో మెగాస్టార్​ చిరంజీవి సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మెగస్టార్‌ చిరంజీవి కిమ్స్‌ హాస్పిటల్‌కు వెళ్లి.. సిరివెన్నెల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ రోజు సాహిత్యానికి చీకటి రోజన్నారు చిరంజీవి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని మెగా స్టార్ చిరంజీవి అన్నారు.

సిరివెన్నెల మరణంతో తన గుండె తరుక్కుపోతోందని, బరువెక్కిపోతోందని చిరు అన్నారు. తెలుగు సినీపరిశ్రమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీచేయలేరని చెప్పారు. ఎంతో మందిని శోక సముద్రంలో ముంచి దూరమైపోయిన ఆయన నిజంగా మనందరికీ, ఈ సాహిత్య లోకానికి అన్యాయం చేశారని చెప్పుకొచ్చారు. భౌతికంగా సిరివెన్నెల దూరమైన కానీ తన పాటలతో ఇంకా ఆయన బతికే ఉన్నారని వెల్లడించారు.

సాహిత్యానికి ఇది చీకటి రోజు : చిరంజీవి | NTV

హాస్పిటల్ జాయిన్ అవ్వడానికి ముందు సిరివెన్నెల తనకు కాల్ చేసి మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. త్వరలో వచ్చేస్తా చెన్నై కి ట్రీట్మెంట్ కోసం వెళ్దాం అన్నారని గుర్తు చేసుకొని కుమిలిపోయారు. ‘‘మంత్ ఎండ్ కు వస్తా అని నాతో అన్నారు.. ఇలా జీవం లేకుండా వస్తాడు అనుకోలేదు.. సిరివెన్నెల నన్ను ఎప్పుడు మిత్రమా అని పిలిచేవారు.’’ అని చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ఓ గొప్ప కవి వృక్షాన్ని కోల్పోయామన్నారు. సమాజంలో కుళ్లు కడిగేసే రీతిలో ఆయన పాటలు ఉంటాయని, తెలుగు సాహిత్యానికి సిరివెన్నెల లాస్ట్ లెజెండ్.. ఆయన లోటు ఎవరు తీర్చలేరు.. సాహిత్యానికి ఇది చీకటి రోజు.. మిత్రమా వియ్ మిస్ యూ… అంటూ బాధప్త హృదయంతో సిరివెన్నెలతో తన అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

Related posts