telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఒకేవేదికపై మెగాస్టార్, నందమూరి నటసింహం… !

Kalyan

మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ మరోసారి ఒకే వేదిక‌పై క‌నిపించి ప్రేక్షకులకు కనువిందు చేశారు. ఈ మ‌ధ్య 80 కాలం నాటి తార‌లంద‌రు చిరు ఇంట్లో రీయూనియ‌న్ వేడుక జరుపుకోగా, ఆ కార్య‌క్ర‌మానికి బాల‌కృష్ణ హాజ‌రు కాలేదు. దీంతో చిరుకి, బాలయ్య‌కి విబేధాలు వ‌చ్చాయింటూ పుకార్లు వ‌చ్చాయి. కాని తాజా ఫోటోల‌ని బ‌ట్టి చూస్తుంటే వీరిద్ద‌రి మ‌ధ్య సఖ్య‌త అలానే కొన‌సాగుతుంద‌ని తెలుస్తుంది. కాగా, సి. క‌ళ్యాణ్ 60 వ బ‌ర్త్ డే వేడుక‌లు నిన్న సాయంత్రం తాజ్ కృష్ణ హోట‌ల్‌లో జ‌రిగాయి. అతిర‌థ‌మ‌హార‌ధులు ఈ కార్య‌క్రమానికి హాజ‌రు కాగా, చిరు, బాల‌య్య ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఇక గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి చిత్ర లాంచ్ స‌మ‌యంలో వీరిద్ద‌రు ఒకే వేదిక‌ని పంచుకోగా, మ‌ళ్ళీ సి.క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే వేడుక‌లో క‌లిసి క‌నిపించారు. బాల‌య్య‌, చిరు ఒకే ఫ్రేములో కనిపిస్తుండే స‌రికి అభిమానుల ఆనందం హ‌ద్దులు దాటుతుంది.

Related posts