telugu navyamedia
సినిమా వార్తలు

“జెర్సీ” ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు

Jersey1

గౌతమ్‌ తిన్ననూరి సినిమాకు దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న చిత్రం “జెర్సీ”. ఈ చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తున్నారు. 1990ల కాలం నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. రంజీ క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను ఈ నెల 19న భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. అంతవరకు ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలకు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 12న ఉదయం 9 గంటలకు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. 15న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందట. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి.

Related posts