telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్ 1, బుధవారం రాశిఫలాలు..

మేష రాశి..

ఆస్తికి సంబంధించిన విషయాల్లో మీరు లాభ పడతారు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తుంటే ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ప్రశాంతత కోసం దైవధ్యానం చేయడం ఉత్తమం. పాత ప్రణాళికలను మళ్లీ ప్రారంభించే బలమైన అవకాశాలు ఉన్నాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది.

వృషభ రాశి..

అధికారుల సాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి. పొట్ట, జీర్ణక్రియకు సంబంధించిన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఈ నెలలో ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు.తరచూ దేవాలయ సందర్శనం చేస్తారు.

మిథున రాశి..

బుద్ధిబలం బాగుంటుంది. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో పెట్టు బడులు పెట్టే అవకాశం ఉంది. మీకు మీ అన్నదమ్ముల మద్దతు లభిస్తుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. హోల్‌సేల్ వ్యాపారులు, రేషన్ డీలర్లకు అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి.

కర్కాటక రాశి..

శ్రమకు తగిన ఫలితాలు ల‌భిస్తాయి. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

సింహ రాశి..

వైద్యులకు శస్త్రచికిత్స చేస్తున్న‌ప్పుడు జాగ్ర‌త్త‌ అవసరం. స్త్రీలు టీ.వీ కార్యక్రమాల్లో రాణిస్తారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. పూర్వీకుల ఆస్తి నుంచి కూడా ప్రయోజనం పొందే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు విద్యా రంగంలో విజయం సాధించే అవకాశం ఉంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు.

కన్య రాశి..

వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ప్రతి విషయంలోను మౌనం వహించడం మంచిది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన బాధ కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం క‌లుగుతుంది.

తుల రాశి..

చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. కుటుంబ విషయంలో కూడ మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. తోటివారి సాయం ఉంటుంది. అలసట చెందకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులను నియంత్రించాలి. మీ పిల్లలు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. అనవసర విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి.

వృశ్చిక రాశి..

చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి. గిట్టని వారితో మితభాషణం అవసరం. మీ వ్యాపారంలో గణనీయమైన లాభం పొందుతారు. దిగుమతి-ఎగుమతి ద్వారా విదేశీ వనరుల నుండి లాభం పొందే సూచనలు ఉన్నాయి. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. పత్రికా రంగంలోని వారికి, కళారంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలు కళాత్మక పోటీల పట్ల ఆశక్తి చూపిస్తారు.

ధనస్సు రాశి..

అయిన‌వారితో పంతాలు, పటింపులకు ఇది సమయం కాదు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ఖ‌ర్చులు ఉంటాయి. ఇష్టదైవారాధన మంచిది. నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.

మకర రాశి..

భాగస్వామ్యుల మధ్య ఆసక్తి కరమైన విషయాలు చర్చకు వస్తాయి. ప్ర‌యాణాలు చేసే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి.బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి.

కుంభ రాశి..

ప్రారంభించిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవింద నామాలు చదివితే బాగుంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే మీ కోరిక ఈ నెలలో ఇంకా పెరుగుతుంది. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి.ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.

మీన రాశి..

పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధుమిత్రులను కలుపుకొనిపోతారు. సంపదను కూడబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు.

Related posts