telugu navyamedia
రాశి ఫలాలు

న‌వంబ‌ర్ 6, శనివారం రాశిన‌ఫ‌లాలు..

మేష రాశి..

ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబసభ్యులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి సలహాలు, సూచనలు పొందుతారు.విద్యార్థినులలో ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు.

వృషభ రాశి..

కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. వృత్తుల వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పనులు చేపట్టే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

మిథున రాశి..

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. అధిక శ్రమ తప్పదు.ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల ఇబ్బందు లెదుర్కుంటారు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి.

కర్కాటక రాశి..

ఇతరులను సాయం చేసి ఆదుకోవాలనే తలంపుతో చిక్కులు కొనితెచ్చుకునే ప్రమాదం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన మేర ఫలితాలు పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. చేపట్టిన పనులలో మంచి ఫలితాలు అందుకుంటారు. కొత్త రుణాలు చేస్తారు.

సింహ రాశి..

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.. శత్రువులపై విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు తప్పవు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వ‌స్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు ఏర్ప‌డ‌తాయి.

కన్య రాశి..

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పనిలో శ్రమ పెరిగినా.. ధైర్యంతో ముందుకెళ్లి విజయం సాధిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోకపోవడం మంచిది. రుణవిముక్తులు కావటంతో పాటు బంగారం , విలువైన ప‌త్రాలు తాకట్టు విడిపించుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం మంచిది కాదు.

తుల రాశి..

కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు అధికం. ఆరోగ్యసమస్యలు త‌లెత్తుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఏర్ప‌డ‌తాయి. ఆశించిన ఫలితాలు ఉండ‌వు. ప్రయాణాలు తప్పవు. పెద్దల నుంచి సలహాలు పొందుతారు. కాస్త శ్రమ పెరుగుతుంది.

వృశ్చిక రాశి..

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మంచి పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. సంఘంలో గౌరవం ల‌భిస్తుంది. భూ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

ధనుస్సు రాశి

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మిత్రుల ప్రోత్సాహంతో దైవదీక్షలు స్వీకరిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. కీలక వ్యవహారాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.

మకర రాశి

వ్యాపార లావాదేవీల్లో స్వల్ప ఆటుపోట్లు, చికాకులు తప్పవు. రాబోయే ధనానికి ముందుగానే ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇతరులు చెప్పిన మాటలు వినకపోవడం మంచిది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొత్త పరిచయాలు చేస్తారు.

కుంభ రాశి..

స్త్రీలు శుభకార్యాలలో కలుపుగోలుగా వ్యవహరించి అందరిని ఆకట్టుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధువుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఏ పని చేపట్టినా ధైర్యంతో ముందుకెళితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీన రాశి..

ఖర్చులు అధికంగా ఉన్నా ధనానికి కొదువ ఉండడు. మీ శ్రీమతి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఎక్కువగా కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయి. కీలక విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. బంధుమిత్రులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.

 

Related posts