telugu navyamedia
రాజకీయ

న్యాయ‌ వ్యవస్థపై విశ్వ‌స‌నీయ‌త‌ను ర‌క్షించ‌లేని క్ష‌ణం స‌మాజంలో గౌర‌వాన్ని పొంద‌లేం ..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతల నుంచి విరమణ పొందారు  సీజేఐ ఎన్వీ రమణ. ఈ సందర్భంగా ఎన్వీ రమణ ప్రసంగిస్తూ..ఆయన జాతికి క్షమాపణలు చెప్పారు. సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్ విషయంలో ఆలస్యం జరుగుతున్నది.

దేశంలో పెండింగ్ కేసులు పెద్ద సమస్యగా మారుతున్నాయి. కేసుల లిస్టింగ్, పోస్టింగ్ విషయంలో బాగా జాప్యం జరుగుతోంది. ఈ విషయం మీద దృష్టి పెట్టలేకపోయాను. అందుకు నా క్షమాపణలు అంటూ ఆయన మాట్లాడారు. విధుల్లో ఉన్న ప్ర‌తి రోజు అవిశ్రాంతంగా నా వంతు కృషి చేశాను అంటూ ఆయన తెలిపారు.

కోర్టులో విధుల్లో ఉండే ఆఫీస‌ర్లే న్యాయ వ్య‌వ‌స్థ విశ్వ‌స‌నీయ‌త‌ను కాపాడాల‌న్నారు. వ్యవస్థపై విశ్వ‌స‌నీయ‌త‌ను ర‌క్షించ‌లేని క్ష‌ణం స‌మాజంలో ప్ర‌జ‌ల నుంచి గౌర‌వాన్ని పొంద‌లేమ‌ని ఆయన హితవు పలికారు

అలాగే  తన జీవితంలో ఎదురైన అనేక విషయాలను గుర్తు చేసుకున్నారు ..జీవితంలో తనకు విద్య నేర్పిన గురవులకు, స్ఫూర్తినిచ్చిన వారికి రుణపడి ఉంటానని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. 

12 ఏళ్ల వయసులో తొలిసారి కరెంటు చూసినట్లు పేర్కొన్నారు. 17 ఏళ్లకు ట్రేడ్‌ యూనియన్‌కు నేతృత్వం వహించానని తెలిపారు. ఈ వృత్తిలో అనేక ఒడిదొడుకులు వస్తాయని న్యాయవాదులు గ్రహించాలని సూచించారు

కనీస వసతులు లేని గ్రామం నుంచి తన ప్రస్థానం మొదలైందని, వృత్తి పరంగా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని తెలిపారు.. తాను గొప్ప జడ్జీని కాకపోవచ్చు కానీ, సామాన్యూడికి న్యాయం అందించడానికి కృషి చేశానని సీజేఐ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా విశేష సేవలు అందించారు. 13ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రమణ పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు. 2021 ఏప్రిల్ 24 నుంచి సీజేఐగా ఎన్వీ రమణ కొనసాగుతున్నారు.

కాగా, రేపు 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారంచేయనున్నారు. రాష్ట్రపతి భవన్‍లో జస్టిస్ యూయూ లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇక, యూయూ లలిత్ రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8తో ఆయన పదవీకాలం ముగుస్తుంది.

Related posts