telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పోతిరెడ్డిపాడును జగన్‌కు కేసీఆర్ గిఫ్ట్‌గా ఇచ్చారు: రేవంత్‌రెడ్డి

Revanth-Reddy mp

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకునేందుకు జగన్‌కు కేసీఆర్ గిఫ్ట్‌గా ఇచ్చారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమతితోనే ఏపీ సీఎం జగన్ జీవో 203 తెచ్చారని అన్నారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, ప్రసాద్ కుమార్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిని కలిశారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ మే 5న జగన్ ప్రభుత్వం జీవో తెస్తే ..మే 11న కేసీఆర్ సమీక్ష చేశారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ ఈ జీవోల గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ 55వేల క్యూసెక్కులు తీసుకెళ్తుంటే కేసీఆర్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోతిరెడ్డి కాంట్రాక్టు పనులు కేసీఆర్ చెప్పిన వారికే వస్తాయని, ఏపీ జలదోపిడీపై ప్రధాని, జలవనరుల మంత్రికి లేఖలు రాస్తామని రేవంత్‌ అన్నారు. 

Related posts