telugu navyamedia
సినిమా వార్తలు

భారత్ : సల్మాన్, కత్రినా రొమాంటిక్ సాంగ్ వీడియో

BHarat

బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం “భారత్”. సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్, దిశా పటానీ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం “భారత్” అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. ఈ చిత్రంలో సునీల్ గ్రోవర్, జాకీష్రాప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దక్షిణ కొరియాలో ఘనవిజయం సాధించిన “ఓడ్ టు మై ఫాదర్” చిత్రానికి రీమేక్‌గా భారత్ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో ‘చాష్నీ’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ టీజర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్ లో సల్మాన్, కత్రినాల కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. వీరిద్దరి మధ్య రొమాన్స్ ని అందంగా చూపించారు దర్శకుడు. అలీ అబ్బాస్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో దిశా పటానీ కనిపించనుంది. రంజాన్ కానుకగా జూన్ 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Related posts