telugu navyamedia
సినిమా వార్తలు

“అవెంజర్స్ : ఎండ్ గేమ్” చూసి ఆసుపత్రి పాలైన యువతీ

Avengers

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి చివరి చిత్రంగా వచ్చిన “అవెంజర్స్ ఎండ్ గేమ్” చిత్రం ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. మూడు గంటలున్న చిత్రంలో చివర్లో వచ్చే సన్నివేశాలను చూసి అభిమానులు కంటతడి పెడుతున్నారు. ఐరన్ మ్యాన్, క్యాప్టెన్ అమెరికా, థోర్, హల్క్, బ్లాక్ పాంథర్ ఇలా సూపర్ హీరోలందరినీ ఓ చోట చేర్చి చివరి చిత్రంగా అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో తమ అభిమాన నటులు చనిపోతున్నారని కొందరు, ఇదే చివరి చిత్రమని కొందరు మార్వెల్ అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. చైనాలో ఓ యువతి ఇలానే ఆందోళన చెంది ఏకంగా ఆసుపత్రి పాలైంది. చిత్రంలో చివరి సీన్లను చూసిన యువతి ఉన్నట్టుండి కంటతడి పెట్టడం మొదలుపెట్టింది. ఏడవడం ఆపకపోవడంతో ఆమెకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. దీంతో యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎక్కువగా ఏడవడం వల్ల ఆమె హైపర్‌వెంటిలేషన్‌కు గురైందని డాక్టర్లు తెలిపారు. యువతికి ఆక్సిజన్ పెట్టడంతో కొంతసేపటికి ఆమె మామూలు స్థితికి వచ్చింది. ఒక కామిక్ సిరీస్‌కు ఈ తరహాలో అభిమానులు ఉండడం విశేషమే మరి.

Related posts