telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నవాజుద్దీన్‌ సిద్దిఖీ సోదరి కన్నుమూత

Nawazuddin

బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ సోదరి శ్యామా తమ్షీ సిద్దిఖీ శనివారం కన్నుమూశారు. ఆమె వయసు 26 సంవత్సరాలు. అయితే తన సోదరి శ్యామా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నవాజుద్దీన్‌ గతేడాది అక్టోబర్‌ నెలలో ఆమె 25వ పుట్టినరోజున.. ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. శ్యామా మృతి చెందిన సమయంలో ఓ సినిమా షూటింగ్‌ నిమిత్తం నవాజుద్దీన్‌ అమెరికాలో ఉన్నారు. సోదరి మరణవార్త తెలుసుకున్న నవాజుద్దీన్‌ హుటాహుటిన ఇండియాకు తిరిగి వచ్చారు. సోదరి మృతితో నవాజుద్దీన్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గత ఎనిమిదేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న శ్యామా శనివారం కన్నుమూసినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమెకు 18 ఏళ్ల వయసులోనే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చింది. శ్యామా అంత్యక్రియలు ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బుధానా గ్రామంలో జరిగాయి.

Related posts