telugu navyamedia
సినిమా వార్తలు

మా ఎన్నిక‌లు జ‌ర‌గాలి..!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ప్రతిష్టను దెబ్బతీసే వారెవరినీ ఉపేక్షించవద్దని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి లేఖ రాశారు. మా అధ్యక్ష ఎన్నికలు వెంటనే జరపాలని, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయనీ అన్నారు.

బహిరంగ వేదికలకెక్కి పరువు తీసే విధంగా మాట్లాడే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు మా ఆస్తులు కరిగించేశారంటూ నటి హేమ వ్యాఖ్యలపై నరేష్, జీవిత మండి పడ్డారు. మా నిధులు ఎక్కడకీ పోలేదని, ఇష్టానుసారం కామెంట్లు చేసితప్పుదోవ పట్టించొద్దనీ మండిపడ్డారు.

కాగా..గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైన మా ఎన్నికలపై అగ్ర కథానాయకుడు చిరంజీవి స్పందించారు. మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో చిరు రంగంలోకి దిగారు.

Related posts