telugu navyamedia
సినిమా వార్తలు

“సాహో” ఫస్ట్ ఆప్షన్ శ్రద్ధా కాదట…!

Saaho

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలు కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాపై ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉండడంతో అభిమానులు తొలి రోజే ఈ సినిమాని వీక్షించేందుకు పోటీలు ప‌డుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయమొకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాహో చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తుండడంతో ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అయితే బావుంటుందని ముందుగానే అనుకున్నారు. కానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా ఫస్ట్ ఆప్షన్ శ్రద్దా కపూర్ కాదట. బాలీవుడ్ మెరుపుతీగ కత్రినా కైఫ్ ని ప్రభాస్ సరసన నటింపజేసేందుకు ప్రయత్నించారు. కానీ సాహో చిత్రం కోసం కత్రినా ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేసిందట. దీనితో కత్రినాని పక్కన పెట్టి శ్రద్దా కపూర్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Related posts