టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవీ పుట్టిన రోజు నేడు ( జనవరి 29) . ఇటీవల చిరంజీవికి కరోనా సోకడం వలన ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు మెడిసిన్ వాడుతున్నారు.
కాగా.. తన తల్లి అంజనా దేవి పుట్టినరోజు శనివారం పురస్కరించుకుని సోషల్ మీడియా ద్వారా తల్లికి బర్త్‌డే విషెస్ తెలియజేశారు. “అమ్మా.. నీకు జన్మదిన శుభాకాంక్షలు. క్వారంటైన్‌లో ఉన్న కారణంగా ప్రత్యక్షంగా కలుసుకొని నీ ఆశీస్సులు తీసుకోలేక ఇలా విషెస్ తెలుపుతున్నాను.
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు.. మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. ప్రేమతో.. శంకరబాబు” .అంటూ ట్వీట్ చేస్తూ భార్య సురేఖ, తల్లి అంజనా దేవిలతో కలిసిఉన్న ఫోటోని షేర్ చేశారు.
అమ్మా !🌻💐
జన్మదిన శుభాకాంక్షలు 🌷🌸క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ 🙏
అభినందనలతో …. శంకరబాబు pic.twitter.com/DF6FS1eP3p
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2022
ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటించిన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా ఏప్రిల్ 1న విడుదలకు సిద్ధమవుతుంది. ఇది కాకుండా గాడ్‌ఫాదర్, భోళా శంకర్, బాబీ డైరెక్షన్‌లో సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కూడా చిరంజీవి సిద్ధమయ్యారు.