దివంగత సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు సతీమణి శివకామసుందరి(81) మృతి చెందారు. చెన్నైలోని టి.నగర్‌లోని శారదాంబాళ్ వీధిలో ఉన్న తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు.
దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె భౌతికకాయానికి కన్నమ్మపేట శ్మశానవాటికలో శుక్రవారమే అంత్యక్రియలను నిర్వహించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు దృవీకరించారు.
హన్మకొండలో జన్మించిన శివకామసుందరికి, 1961లో గొల్లపూడి మారుతీరావుతో ఆమెకు వివాహం జరిగింది.అప్పటి నుంచి వారు చెన్నైలోనే స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
కాగా తెలుగునాట గొప్ప నటుడిగా..రచయితగా మాటల మాంత్రికుడిగా పేరు గాంచిన వ్యక్తి గొల్లపూడి మారుతీరావు 2019లో అనారోగ్యంగా గొల్లపూడి మరణించిన సంగతి తెలిసిందే. ఇక గొల్లపూడి మారుతీరావు భార్య మరణం గురించి తెలుసుకొని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.