telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మల్టీఫ్లెక్స్ థియేటర్స్‌ పై కరోనా ఎఫెక్ట్… 500 సీట్ల నుంచి 150 సీట్లు

multiplex

క‌రోనా మ‌హమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనేక రకాలుగా చ‌ర్య‌ల‌ను చేప‌డుతున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా షూటింగ్‌లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ప‌లువురు సెల‌బ్రిటీలు ప్ర‌భుత్వాల‌కు విరాళాల‌ను అందించ‌డ‌మే కాకుండా నైతికంగా త‌మ మ‌ద్ద‌తుని తెలియ‌జేస్తున్నారు. ఇప్పటి వరకు మందు కనిపెట్టని ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ పతనమవుతుంది. కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పుడు ప్రజలందరూ కలిసి పలకరించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే దీని ప్రభావం కాస్త గట్టిగానే ఉంది. షూటింగ్స్ లేక ఎందరో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ ఎత్తేసి, థియేటర్స్‌లో సినిమాలు రన్ అయ్యేది ఎప్పుడో తెలియదు కానీ, మల్టీఫ్లెక్స్ థియేటర్స్ యాజమాన్యం మాత్రం థియేటర్స్ విషయంలో కీలకమైన మార్పులు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇకపై మల్టీఫ్లెక్స్ థియేటర్స్‌లో సామాజిక దూరం పాటిస్తూ సీటు సీటుకు మధ్య గ్యాప్ ఉండేలా.. మొత్తం 500 సిటింగ్ ఉండే థియేటర్‌లో కేవలం 150 సిటింగ్ మాత్రమే ఉండేలా మార్పులు చేస్తున్నారట. అలాగే థియేటర్స్‌లోనికి వచ్చే ప్రేక్షకులకు ఫేస్ మాస్క్‌ని ఫ్రీగా అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా షో పూర్తవ్వగానే థియేటర్ అంతా శానిటైజర్ స్ప్రే చేసేలా ఏర్పాట్లు చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట. దీనికి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయని, త్వరలోనే ఈ మార్పులతో మల్టీఫ్లెక్స్ థియేటర్స్ ముస్తాబవుతాయని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలి.

Related posts