telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఢిల్లీ లో ‘ఎకనమిక్ టైమ్స్’ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు.

రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ తో సీఎం భేటీ కానున్నారు.

రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర మంత్రికి వివరించి ఆర్థిక సాయం కోరనున్నారు.

సాస్కి తో పాటు పూర్వోదయ పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు.

రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేటు హోటల్ లో ‘ఎకనమిక్ టైమ్స్’ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి హాజరవుతారు.

అదే రోజు రాత్రి సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు.

Related posts