telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పరిషత్ ఎన్నికల సమయంలో మావోల పోస్టర్లు.. భయాందోళనలో నేతలు

Two moists killed encounter vishakha

తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి డివిజన్‌ పరిధిలోని తాండ్ర, పోతేపల్లి, బైరాపూర్‌ గ్రామాల్లో మావోయిస్టుల పేర్లతో పోస్టర్లు వెలిశాయి. ఏకంగా సీఎం కేసీఆర్‌కు హెచ్చరిక చేస్తూ ‘ఖబడ్డార్‌ సీఎం కేసీఆర్‌.. ఉరికొయ్యలు, చెరసాలలు విప్లవాన్ని ఆపలేవు..’అని సీపీఐ మావోయిస్టు పేర ఎర్ర సిరాతో వాల్‌పోస్టర్లు వేశారు. తాండ్ర స్టేజీ వద్ద, వెల్దండ మండలంలోని పోతేపల్లి, బొల్లంపల్లిలో ఒకటి చొప్పున అంటించారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో ఈ పోస్టర్లు వేయడంతో నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మరో వైపు ఎప్పుడెమి జరుగుతుందోనని ప్రజలుల ఆందోళనకు గురవుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ పోస్టర్లు వెలియడంతో నక్సల్స్‌ కార్యకలాపాలు మొదలయ్యాయనే అనే అనుమానం వ్యక్తమవుతుంది. చాపకిందనీరులా మళ్లీ మావోయిస్టులు పార్టీని విస్తృత పరిచి యువతను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Related posts