telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సంక్షేమ పథకాల అమలు ఘనత సీఎం కేసీఆర్‌దే: మంత్రి అల్లోల

indrakaran reddy

సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శ‌నివారం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని ప‌లు వార్డుల్లో పెంచిన పింఛన్లను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన పింఛన్ ప్రకారం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2,016 చొప్పున, వికలాంగులకు రూ.3,016 చొప్పున అందజేస్తున్నామ‌ని తెలిపారు.

గ‌తంలో ఫించ‌న్ల కోసం ప్ర‌భుత్వం రూ.15 కోట్ల 36 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తే ఇప్పుడు పెంచిన ఫించ‌న్ల కోసం దాని కంటే రెట్టింపుగా రూ.31 కోట్లు ఖ‌ర్చు చేస్తుంద‌న్నారు. వికలాంగులకు చేయూతనందించి పేదల ఇంట్లో సీఎం కేసీఆర్ పెద్దకొడుకయ్యాడని అన్నారు. తెలంగాణలో దేశం గర్వించదగ్గ రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబార‌క్ వంటి ఇతర పథకాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయ‌ని వెల్ల‌డించారు.

Related posts