telugu navyamedia
సినిమా వార్తలు

నిర్మాతల మండలి మాటలకు విలువ లేదా ?

Majili

సినిమాలు వెండి తెరపై ప్రదర్శనతోనే ముగియకుండా డిజిటల్, శాటిలైట్ వేదికలపై మళ్లీ మళ్లీ ప్రదర్శితం అవుతున్నాయి. అమేజాన్ ప్రైమ్ లాంటి డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో కొత్త సినిమాల కోలాహలానికి తెలుగు నిర్మాతల మండలి ఈ మధ్యే ఓ కండిషన్ పెట్టింది. మరీ బాక్సాఫీస్ వద్ద విడుదలైన వారం, పది రోజుల్లోనే జనాల సెల్ ఫోన్లలోకి వచ్చేయకుండా నియంత్రణ విధించింది. దీంతో ఏప్రిల్ నుంచీ విడుదలైన తెలుగు సినిమాలు 60 రోజుల వరకూ డిజిటల్ లేదా శాటిలైట్ ప్లాట్ ఫామ్స్‌పై విడుదల చేయడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు ఈ రూల్ కిందకి రావాల్సిన మొదటి సక్సెస్ ఫుల్ మూవీ చైతన్య, సమంత “మజిలీ”. తాజాగా అమేజాన్ కంపెనీ మే 10న ‘మజిలీ’ వచ్చేస్తోందంటూ ప్రకటించింది. అంటే 60 రోజుల గ్యాప్ నియమం పక్కదారి పట్టినట్టే. అంతే కాదు అమేజాన్‌లో “మజిలీ” వచ్చేస్తే, ఇంకా ఇప్పటికీ కొన్ని థియేటర్స్‌లో ఉన్న ఆ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. 50 రోజుల వరకూ పెద్ద తెరపై ఉండి అర్ధశత దినోత్సవం జరుపుకోవాల్సిన సినిమా అర్ధాంతరంగా ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తుంది. మరి ఈ విషయంపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts