telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షాకింగ్… బిగ్ బాస్ రియాలిటీ షో రద్దు…!?

Bigg-Boss

2006వ సంవత్సరంలో హిందీలో ఆరంభమైన ఈ రియాలిటీ షో ఫ్రాంచైజీ.. 2018కి కన్నడ, మలయాళీ, తెలుగు, తమిళ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా ఫేమస్ కావడం విశేషం. ఇకపోతే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా జూలై 17 2017లో ‘బిగ్ బాస్’ మొదటి సీజన్ మొదలవగా.. వారాలు గడుస్తున్న కొద్దీ ప్రేక్షకాదరణ పొందుతూ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోయింది. ఆ తర్వాత నాని హోస్ట్‌గా సాగిన రెండో సీజన్ కూడా మంచి వ్యూస్ రాబట్టుకుంది. మరోవైపు ఈ సీజన్‌లో కంటెస్టెంట్ కౌశల్ మందా గెలవడానికి ‘కౌశల్ ఆర్మీ’ బిగ్ బాస్ ఓటింగ్ సిస్టంను శాసించిందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించిన మూడో సీజన్ తాజాగా పూర్తయిన సంగతి తెలిసిందే. నాల్గో సీజన్ హోస్ట్ కోసం మహేష్ బాబు పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. హిందీలో ఏకంగా 13 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా మలయాళంలో మోహన్ లాల్ హోస్ట్‌గా బిగ్‌బాస్ 2 షో నడుస్తోంది. తాజాగా ఈ షోను రద్దు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే షో నిర్వాహకులు ఓ ప్రకటన జారీ చేశారు. అయితే బిగ్‌బాస్‌ షోలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రంజిత్ కుమార్‌ను ఎలిమినేట్ చేయడం వల్ల ఎగిసి పడుతున్న నిరసనల కారణంగా ఈ షోను ఆపేస్తున్నారా ? లేక ప్రపంచ వ్యాప్తంగా అందరినీ బెంబేలేత్తిస్తున్న కరోనా వైరస్ కారణంగా నిలిపివేస్తున్నారా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. .

Related posts