రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా వైఎస్సార్ సీపీ నేత చల్లా మధుసూదన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి చల్లా మధుసూదన్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు.
ఏపీలోని 13 జిల్లాల్లో బూత్ లెవెల్ ట్రైనింగ్, కన్వీనర్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా నిర్వహించి ప్రతిష్టాత్మకమైన పార్టీ విజయానికి కృషి చేశారు. పార్టీలో ఐటీ వింగ్ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర కార్యదర్శిగా పార్టీకి ఎనలేని సేవ చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో విస్తృతంగా పనిచేస్తూ, సమాజ అభివృద్ధిపై పరిపూర్ణమైన అవగాహన కలిగివున్న వ్యక్తిగా చల్లా మధుసూదన్ రెడ్డిని ఈ పదవిలో నియమించడం జరిగింది.
తెలంగాణలో బీజేపీ కార్యకర్తలపై దాడులు: ఎంపీ బండి సంజయ్