telugu navyamedia
క్రీడలు వార్తలు

అది క్రింద స్ఫూర్తికి విరుద్ధం : అక్తర్

సౌతాఫ్రికా-పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో వన్డే లో పాక్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ తొలి బంతిని ఫకర్ జమాన్ లాంగాఫ్ దిశగా హిట్ చేసి.. సింగిల్.. ఆ వెంటనే డబుల్ కోసం పరుగెత్తాడు. అయితే.. అతను పిచ్ మధ్యలో ఉండగానే కీపర్ డికాక్ తన బుర్రకి పదునుపెట్టాడు. తెలివిగా బంతిని బౌలర్ ఎండ్ వైపు వేయాలని ఫీల్డర్‌కు సూచిస్తూ ఫకర్‌ను బోల్తా కొట్టించాడు. డికాక్ మాటలను నమ్మిన ఫకర్ పిచ్ మధ్యలో బౌలర్ ఎండ్‌వైపు చూస్తూ సమయాన్ని వృథా చేశాడు. దాంతో బంతిని అందుకున్న డికాక్ సెకన్ల వ్యవధిలోనే వికెట్లకు కొట్టేసి ఫకర్‌ను పెవిలియన్ చేర్చాడు. అయితే డికాక్ ఉద్దేశపూర్వకంగానే ఫకర్ జమాన్‌ దృష్టి మరల్చాడని, ఇది క్రీడా స్పూర్తికి విరుద్దమని పాక్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్తర్.. తన డికాక్ తీరును తప్పుబట్టాడు. ‘మైదానంలో డికాక్ చేసిన పనిని చీటింగ్ అనను. కానీ ఇది క్రీడా స్పూర్తికి విరుద్దం. ఆట యొక్క గొప్పతనాన్ని దెబ్బతీయడమే. దీన్ని నేనేమాత్రం ఆమోదించను. డికాక్ ఓ గొప్ప క్రికెటర్. అతను ఇలా చేయాల్సింది కాదు. ఆ టైమ్‌లో ఫకర్.. బంతిని నాన్‌స్ట్రైకర్ ఎండ్‌వైపు వేస్తారనుకున్నాడు. క్వింటన్ కూడా ఉద్దేశ పూర్వకంగానే అలా చేశాడు.’అని అక్తర్ చెప్పుకొచ్చాడు. ఫకర్ జమాన్ డబుల్ సెంచరీ మిస్సవడం తనను చాలా హార్ట్ చేసిందని అక్తర్ చెప్పుకొచ్చాడు.

Related posts