telugu navyamedia
క్రీడలు వార్తలు

రోహిత్ మొదటి అర్ధశతకం ఎవరి బ్యాట్ తో చేసాడో తెలుసా…?

వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్‌‌మెంట్ తరువాత.. అతని స్థానాన్ని భర్తీ చేసాడు రోహిత్ శర్మ. నిలకడగా బ్యాటింగ్ చేయడమెలాగో రోహిత్‌ను చూసి తెలుసుకోవచ్చు..అతణ్ని చూసి నేర్చుకోవచ్చు. అతను క్రీజ్‌లో ఉన్నంత సేపూ బౌలర్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని బంతులను సంధిస్తుంటారు. ఖచ్చితంగా అవుట్ అవుతాడకున్న బంతిని కూడా సిక్స్‌గా మలిచే సత్తా ఉందీ టీమిండియా వైస్ కేప్టెన్‌కు. వన్డే, టీ20 ఫార్మట్‌లో పరుగుల వరదను పారించే రోహిత్ శర్మ.. తన కేరీర్‌లో తొలి అర్ధసెంచరీని 2007లో నమోదు చేశాడు. తాజాగా దినేష్ కార్తీక్ మాట్లాడుతూ… టీ20 ప్రపంచకప్ 2007 ఎడిషన్‌లో భాగంగా దక్షిణాఫ్రికా డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన బ్యాట్‌తో రాణించాడని చెప్పాడు. అతను హాఫ్ సెంచరీ సాధించిన బ్యాట్ తనదేనని తేటతెల్లం చేశాడు. క్రీజ్‌లో దిగడానికి ముందు రోహిత్ శర్మ అసహనంతో కనిపించగా.. తాను అతణ్ని పలకరించానని చెప్పాడు. తన బ్యాట్ అచ్చి రావట్లేదని అసంతృప్తితో సమాధానమిచ్చాడని అన్నాడు. ఆ వెంటనే తన బ్యాట్ అడగ్గా.. తాను వెనుకా ముందు ఆలోచించకుండా దాన్ని రోహిత్‌కు ఇచ్చానని చెప్పాడు డీకే. కీలకమైన ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడని, 40 బంతుల్లో 50 పరుగులు చేశాడని గుర్తు చేసుకున్నాడు. రోహిత్ శర్మ తొలి అర్థసెంచరీ తన బ్యాట్ నుంచి జాలువారడాన్ని తలచుకుంటే ఇప్పటికీ గర్వంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడని పేర్కొన్నాడు.

Related posts