telugu navyamedia
క్రీడలు వార్తలు

వార్నర్ పై తన మొదటి అభిప్రాయం ఏంటో చెప్పిన క్యాండీస్…

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్-క్యాండీస్‌లది ఎంత అన్యోన్యమైన దాంపత్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరికొకరు ఇంత ప్రేమను చూపించుకుంటున్న ఈ జంట.. ఒకే ప్రాంతంలో 500 మీటర్ల దూరంలో పెరిగినా ఒకరికొకరు తెలియదంట. ఈ విషయాన్నే క్యాండిసే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంతేకాకుండా వార్నర్‌ను తొలిసారి చూసినప్పుడు వీడెవడ్రా ఇంత మొరటుగా ఉన్నాడని అనుకున్నానని, అస్సలు అతనిపై ఎలాంటి ఇంప్రెషన్ కలగలేదని తెలిపింది. ‘మా వివాహానికి రెండేళ్ల ముందు మా ఇద్దరి కామన్ ఫ్రెండ్ ద్వారా మేం తొలిసారి కలుసుకున్నాం. అప్పడు నేను ఆస్ట్రేలియాలో ప్రాచుర్యం పొందిన సీటీ2సర్ఫ్ మారథన్ రన్ పూర్తి చేశాను. నా ఫ్రెండ్ పక్కన ఉన్న వార్నర్ చాలా మొరటుగా కనిపించాడు. ఏ మాత్రం స్నేహపూర్వకంగా ఉంటాడనిపించలేదు. మాములుగా హాలో మాత్రమే చెప్పుకున్నాం. అతనో అహంకారి, మొరటు వ్యక్తి అనే భావన నాలో కలిగింది. అయితే అప్పటికే అతనికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది’అని క్యాండిస్ చెప్పుకొచ్చింది. ఇక వార్నర్‌ను టీవీల్లో చూసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా అతనికి తాను మేసేజ్ చేశానని క్యాండిస్ గుర్తు చేసుకుంది. అలా మొదలైన తమ ప్రేమ.. వివాహానికి దారితీసిందని చెప్పుకొచ్చింది.

Related posts