telugu navyamedia
రాజకీయ

ఈసీ పై మండిపడ్డ మాయావతి!

Mayawati Welcomes Reservation To Upper Castes
కేంద్ర ఎన్నికల సంఘం పై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. ఆమె ప్రచారంపై ఎన్నికల కమిషన్‌ (ఈసీ) విధించిన 48 గంటల నిషేధం ముగిసిన వెంటనే ఈసీ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. గురువారం గోపాలగంజ్ లో  నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈసీ దళిత వ్యతిరేకి అయినందునే ఉత్తర భారత్‌లో దళితుల రాజధానిగా భావించే ఆగ్రాలో తనను ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించిందని ఆరోపించారు. 
బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయుధ దళాల ప్రస్తావనను తీసుకొచ్చి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినప్పటికీ ఈసీ మౌనం పాటించిందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ‘న్యాయ్‌’పథకంపై కూడా విమర్శలు చేశారు. ‘ఆ పథకం ఒక గారడీ. కాంగ్రెస్‌ ప్రకటించిన కనీస ఆదాయం నెలకు రూ.6,000 హామీపై మాకు నమ్మకం లేదని ఆమె దుయ్యబట్టారు.

Related posts