telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

‘MLA దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయండి’ స్పీకర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌పై చర్యలు తీసుకోవాలంటూ BRS ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన దానంపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చారు. కాగా, దానం నాగేంద‌ర్‌ ఆదివారం గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆ పార్టీ ఎమ్మె్ల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ త‌ర‌పున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేంద‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్పీక‌ర్‌ను కోరామ‌ని తెలిపారు.

గతం లో మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఒక పార్టీ త‌ర‌పున గెలిచి మ‌రో పార్టీలో చేరే ఎమ్మెల్యేల‌ను రాళ్ల‌తో కొట్టి చంపాల‌ని అన్నారు . మరి ఇప్పుడు మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల‌ను ఎలా తీసుకుంటారు అని పాడి కౌశిక్ రెడ్డి ప్ర‌శ్నించారు. నోటికొచ్చిన‌ట్లు మాట్లాడ‌టం స‌రికాద‌ని రేవంత్‌ని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్పించుకొని ఆనందం పొందుతున్నాడని మండిపడ్డారు. ఆదివారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరూ తమ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో దానంపై అనర్హత వేటు వేయాలని ఇవాళ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి పిటిషన్ ఇచ్చారు. అయితే ఈ పిటిషన్‌పై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాల్లో పెద్దగా ప్రభావం లేకపోయిన. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం సత్తా చాటింది. అన్ని స్థానాలు కైవసం చేసుకుంది.

ఈ నేపథ్యంలో దానం నాగేందర్ మంత్రి పదవి కోసం మే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కాకుండా దానంను సికింద్రాబాద్ ఎంపీగా బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ సిద్ధం అయినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి.

Related posts