మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరుకుంది. శివసేన నేత ఏక్‌నాథ్ శిండే వర్గీయులు తిరుగుబాటు కారణంగా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.
గురువారం జరగాల్సిన ఫ్లోర్ టెస్ట్‌కు ముందే శివసేన నాయకుడు ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ కారణంగా మహా వికాస్ అఘాడీ సర్కార్ కుప్పకూలిపోయింది.
ఇప్పుడు మహారాష్ట్ర 20వ కొత్త సీఎంగా మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణస్వీకారం చేయవచ్చని సమాచారం. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ మొదలు కాగానే ఏక్‌నాథ్ షిండేను ఉపముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలున్నాయి. షిండేకి మాత్రమే కాదు.. థాక్రేలకు వ్యతిరేకంగా పోరాడటంలో తనకు సహకరించేందుకు మంత్రి పదవులు వదులుకున్న వారికీ..ప్రాధాన్యత దక్కనున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఎలాంటి అవకాశం తీసుకోకూడదని, శివసేన రెబెల్స్ ముంబయికి రాకూడదని బీజేపీ కోరింది.
ఉద్ధవ్ థాక్రే రాజీనామా తర్వాత ఫ్లోర్ టెస్ట్ అవసరం లేదు కాబట్టి.. నేడు ముంబయికి చేరుకోనున్న తిరుగుబాటు నేతలు ఇప్పుడు రావాల్సిన అవసరం లేదనీ, నేరుగా ప్రమాణస్వీకారం రోజు రావాలని బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ కోరారు.
ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాతో మహారాష్ట్ర పరిపాలనలో ఒక చీకటి కాలానికి ముగింపు పలికిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అన్నారు.
కాగా మహారాష్ర్టలో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్-పై ఆధిపత్యం సాధించేందుకూ బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆసియాలోనే అత్యంత సంపన్నమైన కార్పొరేషన్ ఇది. ఓ రాష్ట్రానికి పెట్టేంత బడ్జెట్ ఈ కార్పొరేషన్ డెవలప్‌మెంట్ కోసం కేటాయిస్తారు.
ఇంత కీలకమైన కార్పొరేషన్‌నూ దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తోంది కాషాయ పార్టీ. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నందునఈ లోపు రాష్ట్రంపై పూర్తి స్థాయి పట్టు సాధించాలని భావిస్తోంది. ఇదన్నమాట విషయం.
సంయమనంతో మాట్లాడాలి.. బొత్సకు పవన్ హితవు