telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పెట్రోల్ ధ‌ర‌ల‌పై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు…

Somu Veerraju BJP

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు తాజాగా మాట్లాడుతూ… పెట్రోల్ ధ‌ర‌ల‌ను జీఎస్టీ పరిధిలోకి వస్తే తప్పకుండా ధరలు త‌గ్గుతాయ‌న్నారు.. అయితే, పెట్రోల్‌ను జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకురావడాని రాష్ట్రాలు ఒప్పుకుంటే ధరలు త‌గ్గుతాయ‌ని చెప్పుకొచ్చారు. పెట్రోల్‌ను దిగుమతి చేసుకోవడానికే కేంద్రం చాలా ఇబ్బంది ప‌డుతోంద‌న్న సోము వీర్రాజు.. అందువల్ల పెట్రోల్‌లో ఇంధనాల్ కలపడం, బ్యాటరీల వాహనాలు వంటి ప్ర‌త్యామ్నాయాలు ప్రవేశపెడుతున్న‌ట్టు తెలిపారు. మ‌రోవైపు.. రైతులకు బకాయిలు ఉన్న సొమ్ములను ఏపీ ప్రభుత్వం వెంటనే చెల్లించాల‌ని డిమాండ్ చేశారు సోము వీర్రాజు.. మిల్లర్లకు ఈ ప్రభుత్వం అండంగా నిలబడడం వల్ల రైతులు ధాన్యాన్ని మిల్లర్లకే అమ్ముకుంటున్నార‌న్న ఆయ‌న‌.. ప్రభుత్వం ప్రజలన్ని.. రైతులను పూర్తిగా మోసం చేస్తోంద‌ని ఆరోపించారు.. ఇక‌, ఇంటి పన్నుల పెంపు పై కేంద్రం ఏ విధమైనా గైడ్ లైన్స్ ఇవ్వలేద‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న‌.. ఇసుక, గనుకు, గ్రావెల్స్ నుంచి వచ్చే ఆదాయాన్ని వదిలేసి.. ప్రజలపై పన్నుల భారం వేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

Related posts