ప్రధాని నరేంద్ర మోదీ రేపు గుంటూరు పర్యటనకు రానున్నారు. మోదీ ఏపీ పర్యటనకు వ్యతిరేకంగా టీడీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు ఘాటుగా స్పందించారు. మోదీ ఏపీ పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉండదని జీవీఎల్ హెచ్చరించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీ పర్యటనపై ముఖ్యమంత్రి కార్యాలయం వేదికగా కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
మంత్రులకు సీఎం చంద్రబాబుకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ప్రధాని పర్యటనను అడ్డుకుంటే తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ప్రకటనలు చేస్తే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉండదని ఆయన అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందనే లెక్కలన్నీ ప్రధాని ఈ సభలో చెబుతారని అన్నారు.
నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయను: రాజా సింగ్