telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్ 5 సెకండ్ వీక్ నామినేషన్ లిస్ట్ ఇదే..

బుల్లితెర రియాలిటీ షో స్టార్ మా బిగ్ బాస్ 5  రెండో వారం నుంచే రచ్చ రచ్చగా మారింది. తొలి వారమంతా పరిచయాలు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడాలు.. ఎంటర్ టైన్మెంట్ తో గడిచి.. తొలి ఎలిమినేషన్ పూర్తి కాగా రెండో వారం నుంచే హౌజ్ లో రచ్చ మొదలైంది.

Bigg Boss Telugu 5 Voting Outcomes: Uma Devi And Nataraj In D | Real News  Hub

సోమవారం నాడు మొదలైన నామినేషన్ల పర్వం ఈ వారం మీద ఇంట్రెస్ట్ పెంచగా.. మంగళవారం నాడు ఇచ్చిన టాస్క్ హీట్ పెంచింది. సోమవారం నాటి ఎపిసోడ్ లో శ్వేతా వర్మ తనలోని ఫైర్ చూపించగా.. కార్తీక దీపం ఉమా కూడా అనకూడని బూతు అనేసింది. ఆ మాటలు విన్న హౌజ్ మేట్స్ ఒక్కసారిగా షాక్ కి గురికాగా.. షణ్ముఖ్ అయితే నోరు తెరిచి నిల్చున్నాడు.

రెండోవారం నామినేషన్ల లిస్టులో కార్తీకదీపం ఉమాదేవీ, యానీ మాస్టర్, నటరాజ్, ప్రియాంక, ప్రియా, ఆర్జే కాజల్, లోబోలు నామినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఎవరు బయటకొచ్చేస్తారన్నది ప్రస్తుతానికి డౌటే. వారం తిరిగే లోగా.. ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తాయి.. ఎవరికి తక్కువ ఫాలోయింగ్ అనే దాని మీద ఆ విషయం ఆధారపడి ఉంటుంది. అయితే కాజల్ వరుసగా రెండో వారం కూడా నామినేట్ అయింది. బిగ్ బాస్ మీద మంచి పట్టు ఉండి.. ఏ గేమ్ ఎలా ఆడాలో తెలిసిన వ్యక్తిగా అందరూ కాజల్ ని టార్గెట్ చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అనేది ప్రతివారం జరిగే ప్రక్రియే. దీనినిబట్టే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఈ నామినేషన్స్ తప్పించుకోవడం కోసం హౌస్ మేట్స్ మనసులు గెలవాలి. అలాగే ఎలిమినేషన్ తప్పించుకోవాలంటే బయట ఉన్న ప్రేక్షకులని కూడా గెలవాలి. ఇలా గెలిచినవాళ్లే విన్నర్ అవుతారు.

Bigg Boss Telugu 5: కెప్టెన్సీ టాస్క్‌లో పడిపోయిన లోబో.. మెడికల్ రూమ్‌లో  చికిత్స | Captaincy Task in Bigg Boss Telugu 5: Lobo injured in Pantam  needa Naada Task - Telugu Filmibeat

Related posts