టాలీవుడ్‌లో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన బండ్ల.. తరువాత నిర్మాతగా మారాడు. అంతేకాదు ప్రొడ్యూసర్‌గా స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు. ఇక ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లి.. అక్కడా సంచలన వ్యాఖ్యలు చేసి, తిరిగి సినిమాల్లోకి వచ్చాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బండ్ల గణేష్ తన వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో జరిగే ప్రతి అంశంపై స్పందిస్తుంటాడు.
సోషల్ మీడియాలో బండ్ల ఒక సెన్సేషన్. చాలా సార్లు ఆయన చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. అయితే హఠాత్తుగా బండ్ల గణేశ్ ట్వీటర్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు.. త్వరలోనే ట్విటర్ గుడ్ బై చెప్పేస్తా. నాకు ఎలాంటి కాంట్రవర్సీలు వద్దు. నా జీవితంలో వివాదాలకు తావివ్వకుండా జీవించాలని అనుకుంటున్నా’ అని బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అతని అభిమానులు, ఫాలోవర్స్ షాక్‌కు గురయ్యారు. ఆయన ఎందుకు సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏమైందో చెప్పండి’ అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.
టాలీవుడ్, నిర్మాతలు మారాల్సిన టైమ్ వచ్చేసింది..