telugu navyamedia
సినిమా వార్తలు

‘మా’ ఎన్నికల్లో బండ‌న్న వినూత్న ప్రచారం..

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో ప్రచార వేడి రసవత్తరంగా కొన‌సాగుతుంది. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పీఠం కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు మధ్య ప్రధాన పోటీ నెల‌కొంది. ప్రకాష్ రాజ్ ముందు నుంచే రంగంలోకి దిగి ప్రచారం మొదలు పెట్టగా మంచు విష్ణు కూడా ప్రచారం మొదలు పెట్టారు. శు్క్రవారం మంచు విష్ణు తన ప్యానల్‌తో సహా మీడియా ముందుకు వచ్చాడు. అందరితో మాట్లాడించాడు. తాను చెప్పాల్సిందంతా చెప్పేశాడు.

మరి నేనెందుకు సైలెంట్ గా ఉండాలి అనుకున్నాడో? ఏమో? బండ్ల గణేష్ కూడా ప్రచారం మొదలు పెట్టారు, అది కూడా తన స్టైల్లో.. జనరల్‌ సెక్రటరీ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగుతున్న బండ్ల గణేశ్‌ వినూత్న ప్రచారానికి తెర తీశారు. ట్విటర్‌ వేదికగా ఓ పోస్టర్‌ షేర్‌ చేసిన ఆయన ‘ఒకే ఒక్క ఓటు. మా కోసం. మన కోసం.. .మనందరి కోసం.. మా తరఫున ప్రశ్నించడం కోసం’ అంటూ ట్వీట్ చేశారు.

Our heroes like to get praised and it's a fact,' says Bandla Ganesh

అధ్యక్షుడు, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారిని, సంయుక్త కార్యదర్శులను, కార్యనిర్వాహక సభ్యులను ఎవర్ని ఎన్నుకుంటారో మీ ఇష్టం…కానీ ప్రధాన కార్యదర్శిగా మాత్రం తనకే ఓటేయాలని, తననే గెలిపించండి అంటూ బండ్ల గణేశ్ పోస్టు పెట్టారు.

ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బండ్ల గణేష్ కు ఇస్తామని చెప్పిన జనరల్ సెక్రటరీ బరిలో ..జీవిత రాజశేఖర్ జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తుండటంతో.. పంతం కొద్దీ బండ్లన్న కూడా ఆ పోటీకి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగాడు. మా ఎన్నిక‌లు రోజుకో ర‌చ్చ మొద‌ల‌వుతుండ‌డంతో అందరి చూపు సినిమా పరిశ్రమపైనే ప‌డింది.

Related posts