telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నివేదా థామస్‌కు అసభ్యకర ప్రశ్నలు… వాళ్ళ నుంచే…!?

Nivetha

సోషల్ మీడియా వల్ల సెలెబ్రెటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గిందన్న మాట వాస్తవమే. కానీ దీనివల్ల సెలెబ్రెటీలకు చాలా వరకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం సెలబ్రిటీలకు, ముఖ్యంగా సినిమా హీరోయిన్లకు సోషల్ మీడియా ఇబ్బందికరంగా మారింది. హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల గురించి ట్రోలింగ్ విచ్చలవిడిగా జరుగుతోంది. తాజాగా ఇలాంటి అనుభవం హీరోయిన్ నివేదా థామస్‌కు ఎదురైంది. సూపర్ స్టార్ రజినీకాంత్ `దర్బార్` సినిమాలో నటిస్తున్న నివేద.. తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో నివేదకు కొన్ని అసభ్యకర ప్రశ్నలు ఎదురయ్యాయి. “మీరు వర్జినా? కాదా?” అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. అలాగే “మీకు బాయ్‌ఫ్రెండ్స్ ఎంతమంది?”, “మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?” లాంటి ప్రశ్నలు నివేదను ఇబ్బంది పెట్టాయి. ఈ ప్రశ్నలకు నివేద స్పందిస్తూ.. “నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. మీరు మరొక మనిషితో మాట్లాడుతున్నారన్న విషయం గుర్తించుకోండి. కొంచెం మర్యాద ఇవ్వండి. నా కోసం సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. త్వరలో మళ్లీ కలుద్దాం” అని సమాధానమిచ్చింది. ఇటీవలె హీరోయిన్ రష్మిక వ్యక్తిగత జీవితం గురించి కొందరు అసభ్యకర కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

Related posts