telugu navyamedia
ఆరోగ్యం

అర‌టితో ఆరోగ్యం..!

అరటి పండు చాలా ప్రముఖమైన, ప్రసిద్ధి  పొందినది. ఇది చాలా మందికి ఇష్టమైన పండు.. అరటి శుభ సూచకం అందుచేత అరటిని శుభకార్యాలలో తప్పకుండా వినియోగిస్తారు. భోజనం తరువాత అరటి పండు తినడం ఆరోగ్యానికి జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. పెళ్లి భోజనాలలో అరటి పండు ఖచ్చితంగా ఉండాల్సిందే. అందువల్ల శుభకార్యాలలో బాగా వాడుతారు.

అంతేకాదు అరటి పండ్లను, పండ్ల రసాలు తయారు చేయడం లోనూ, ఫ్రూట్‌ సలాడ్‌ లలోనూ, ఉపయోగిస్తారు. చాలా మంది డైటింగ్ చేసేవారు వ్యాయామశాలకు వెళ్ళేవారు తగిన శక్తి కోసం ముందు అరటి పండు తింటారు. ఇందులో సరైన పోషకాలు ఉంటాయి

అరటి పండు వల్ల కలిగే ప్రయోజనాలు..

1. ప్రతి 100 గ్రాముల అరటిలో 20 గ్రాముల కార్బోహైడ్రేటులు, 1 గ్రాము మాంసకృత్తులు (ప్రోటీనులు), 0.2 గ్రాములు కొవ్వు పదార్థాలు, 80 కిలోక్యాలరీల శక్తి ఉన్నాయి. అరటి సులభంగా జీర్ణమై మలబద్ధకం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.

2. అరటి పండు సులభంగా జీర్ణమై, మలబద్ధం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.

3.రోజు అరటి పండు తినడం వల్ల బరువు, ఊబకాయం, ప్రేగు సంబంధిత రుగ్మతలు, మలబద్ధకం ఉపశమనం, విరేచనాలు, రక్తహీనత, క్షయవ్యాధి, ఆర్థరైటిస్, గౌట్, మూత్రపిండాలు, మూత్ర రుగ్మతల నుండి అరటి పండు కాపాడుతుంది.

4. రోజు అరటి పండు తినడం వల్ల రక్తపోటును తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, రోగనిరోధకత పెంచడం లొ సహాయపడుతుంది. అరటి ని తినడం వలన కళ్ళు ఆరోగ్యకరంగా ఉంటాయి.

5.బలమైన ఎముకలను నిర్మించడం వల్ల శరీర పెరుగుదలకు, ఎముకల దృఢత్వానికి మంచిది.అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు తగిన మోతాదులో ఉండేలా చేస్తుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల పక్షవాతం ముప్పు తక్కువగా ఉంటున్నట్టు నిపుణులు గుర్తించారు.

5. దీనిలో అత్యధికంగా ఉండే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని చెబుతారు.

6. అరటిపండులో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెజబ్బుల్ని నివారించడమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్నీ కాపాడతాయి.

7.ప్రతిరోజూ అరటి తింటే రక్తహీనత సమస్యను పరిష్కరిస్తుంది. ఎర్రరక్తకణాలో ఇనుము (Iron) శాతాన్ని పెంచి రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది. ఎర్రరక్తకణాలు పెరగడంతో పాటు ఐరన్‌ను పెంపొందించి శరీరానికి రక్త ప్రసరణ సజావుగా జరుపుతుంది.

కాగా..అరటి పండు వల్ల కలిగే ప్రయోజనాలు, అరటి చేసే మేలు తెలిస్తే ఈ పండు తినేందుకు అంద‌రూ ఆస‌క్తి చూపుతారు.

Related posts