పని ఒత్తిడి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. తాజాగా చేసిన అధ్యయనం ప్రకారం పని ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు, నీరసం కారణంగా హార్ట్ ఎటాక్ మరియు స్ట్రోక్ ఎక్కువగా పురుషుల్లో మరియు మహిళల్లో పెరిగింది అని అధ్యయనం ద్వారా రీసెర్చర్లు చెబుతున్నారు.
రిసెంట్‌గా యూరోపియన్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ తెలిపింది. అదే విధంగా డయాబెటిస్, ఆర్టెరీల్ హైపర్టెన్షన్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, స్మోకింగ్, ఒబిసిటీ మరియు ఫిజికల్ ఇన్ యాక్టివిటీ వలన కార్డియో వాస్క్యులర్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని గుర్తించారు. అలానే పని ఒత్తిడి మరియు నిద్రలేమి సమస్యలు కూడా కార్డియోవాస్క్యులర్ సమస్యలని పెంచుతాయి.
అయితే మామూలుగా పురుషులకి మహిళల కంటే ఎక్కువ హార్ట్ ఎటాక్ మరియు స్ట్రోక్స్ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ స్టడీ మహిళల్లో కూడా రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. మహిళల్లో ఒత్తిడి, నిద్రలేమి, సమస్యలు, అలసట, నీరసం కారణంగా హార్ట్ ఎటాక్స్ సమస్య వస్తున్నట్లు గుర్తించారు, ఈ కాలంలో చాలా మంది మహిళలు ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు. అదే విధంగా ఇంటి పనులు ఇలా ఎన్నో పనులు ఉంటాయి. ఈ కారణంగా ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. అయితే మనం గతంతో పోల్చుకుంటే కూడా ఇప్పుడు మరింత ఎక్కువగా అనారోగ్య సమస్యలు మహిళల్లో మరియు పురుషుల్లో వస్తున్నట్లు తెలిపారు.
ఒత్తిడి అనేది శరీరంలో అదనపు కొవ్వును విడుదల చేస్తోందా?
ఒత్తిడితో అదనంగా విడుదలైన కొవ్వు స్థాయిలు సరైన శారీరక శ్రమ లేకపోవడంతో శరీరంలో పేరుకుపోతున్నాయి. ఫలితంగా ఊబకాయం వస్తోంది. అన్ని వైద్య నివేదికలు తేల్చి చెప్పిన విషయమేమిటంటే పని ఒత్తిడి అనేది శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుందని. ఇటువంటి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఆరోగ్యం పెను ప్రమాదంలో పడే అవకాశముంది.
ఈ విషయంలో ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై తామే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. ఒత్తిడిని అధిగమించేందుకు పనిలో కొన్ని మార్పులు చేసుకోవడంతో పాటు జీవనశైలిని మార్చుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని చర్యలు చేపట్టాలి. అవసరమైతే ముందస్తుగా డాక్టర్లను సంప్రదించి ప్రారంభ దశలోనే పని ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.