telugu navyamedia
ఆరోగ్యం

తెల్లమద్ది ఉపయోగాలు..

ఈ ప్రకృతిలో మనకు ఉపయోగపడే జౌషధ గుణాలు కలిగిన మొక్కలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిలో తెల్లమద్ది (Arjun tree) ఒకటి. ఇది గుండెకు సంబంధించిన జబ్బులకు అత్యంత కీలకంగా పని చేస్తుంది

*మద్దిచెక్క చూర్ణమును 3-6 గ్రాములు మెతాదులో, నెయ్యి, పాలు లేదా బెల్లపు నీటితో అనుపానముతో సేవించిన గుండె జబ్బులు తగ్గును( లేదా) మద్ది చెక్క కషాయముతో కాచిన పాలయందు చక్కెర లేదా అతి మధుర చూర్ణం కలిపి త్రాగుచున్న గుండె జబ్బులు తగ్గును. స్వస్థుడు ప్రతిదినము సేవించిన దీర్ఘాయుష్షు పొందును.

*మద్దిచెక్క చూర్ణయును అడ్డసరుపు ఆకు రసమునందు పలుమార్లు భావనం చేసి అందు తేనె, నెయ్యి, పటిక బెల్లం చూర్ణయు సమానంగా కలిపి సేవించిన రక్తముతో కూడిన క్షయ దగ్గు శమించెను.

*మద్దిపట్ట చూర్ణమును తేనెలో కలిపి పాలతో సేవించిన రక్తాతిసారము తగ్గును

* మద్దిపట్ట చూర్ణయు 1-2 స్పూన్‌ల చొప్పున అరకప్పు చక్కెర కలిపిన పాలతో త్రాగిన విరిగిన ఎముకలు త్వరగా అతుకుంటాయి.

*మద్దిపట్ట కషాయము అరకప్పు త్రాగిన మూత్రబంధము, చురుకు, మంట, చీము శమించును.

* ఆకులు రసము పూసిన కీళ్లవాతము తగ్గును.

గమనిక: ఇది కేవలం అవగాహనకు మాత్రమే

Related posts