telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ రాజకీయ వార్తలు

425కి చేరిన కరోనా .. మృతులు.. అమెరికా సాయం..

deaths increased to 131 due to corona virus

చైనా లో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తూనే ఉంది. అక్కడి ప్రజలు క్షణక్షణం భయంతో బతుకుతున్నారు. ఇప్పటికే ఈ మహమ్మారీ బారిన పడి 425 మంది మృతి చెందారు. అంతకుముందు రోజుకంటే సోమవారం నాటికి 65 మంది మృతి చెందినట్లు చైనా ప్రభుత్వం పేర్కొంది. మరణించిన వారంతా సెంట్రల్ హూబే ప్రావిన్స్‌కు చెందిన వారు కావడం విశేషం. కరోనా వైరస్‌ను ఎదుర్కొని దేశం నుంచి పారద్రోలేందుకు చైనా ప్రభుత్వం అన్ని రకాల మార్గాలను వెతుకుతోంది. ఇందులో భాగంగా మొన్నటి వరకు అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య యుద్ధం చేసిన చైనా… ఈ కష్ట సమయంలో ఆదేశ సహకారాన్ని కోరింది. కరోనావైరస్ పోరుకు తమ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించడంతో.. అగ్రరాజ్యం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చైనా కోరింది. ఇప్పటికే కరోనావైరస్‌ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇదిలా ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి మరింతగా జరుగుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయిన వారి సంఖ్య 20438కి చేరుకుంది. మరోవైపు ఇతర దేశాల్లో 151 కేసులు నమోదైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే కరోనా వైరస్‌ పై అమెరికా చేసిన ఆందోళనకరమైప ప్రకటన వల్లే చైనా స్టాక్ మార్కెట్లు 8శాతం మేరా పతనమయ్యాయని చైనా ఆరోపణలు చేసింది. గత రెండువారాలుగా చైనాకు వెళ్లిన వారిని తమదేశంలోకి రాకుండా నియంత్రిస్తున్నామన్న అమెరికా ప్రకటనను చైనా తప్పుపట్టింది. ఇలాంటి కష్ట సమయంలో అమెరికా కక్షపూరితంగా కాకుండా మంచిగా ప్రవర్తించాలని లేనిపోని ఆందోళనలు సృష్టించడం మంచిది కాదన్నారు చైనా విదేశాంగశాఖ మంత్రి.

Related posts