నేడు శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 134 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన డేవిడ్ వార్నర్ (100*) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే శ్రీలంక పేసర్ రజిత తన ఖాతాలో పేలవమైన రికార్డు వేసుకున్నాడు. అతడు వేసిన నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఏకంగా 75 పరుగులు ఇచ్చాడు. దీంతో టీ20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అతడు వేసిన 24 బంతుల్లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఏకంగా ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదడం గమనార్హం. తన తొలి ఓవర్‌లో 11, రెండో ఓవర్‌లో 21, మూడో ఓవర్‌లో 25, ఆఖరి ఓవర్‌లో 18 పరుగులు సమర్పించుకున్నాడు.
234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 99 పరుగులే చేసింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో షనక (17) టాప్ స్కోరర్. ఆసీస్ బౌలర్లలో జంపా మూడు, స్టార్క్, కమిన్స్ చెరో రెండు వికెట్లు తీశారు.