నేడు ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రానికి రాష్ట్ర పరిస్థితిని వివరించామని, ప్రత్యేకహోదా అడిగామని తెలిపారు. విభజనతో ఏపీకి నష్టం జరిగిందని, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఏపీకి రావాల్సిన నిధుల గురించి కేంద్రానికి చెప్పామని, ముఖ్యంగా పోలవరం ప్రాజక్టు, రాజధాని నిర్మాణానికి నిధులు కోరామని బుగ్గన వెల్లడించారు.
విభజన అనంతరం అన్ని విధాలా నష్టపోయిన ఏపీకి సాయం చేయాలని కోరామని తెలిపారు. కాగా, రైతులు, స్వయం సహాయక గ్రూపులకు ఇచ్చే సున్నా వడ్డీ రుణ భారాన్ని కేంద్రమే భరించాలని బుగ్గన అన్నారు. రాష్ట్ర వ్యవహారాల గురించి చెబుతూ, అవినీతి రహిత పాలనే తమ ధ్యేయమని, నవరత్నాల అమలే తమ అజెండా అని ఉద్ఘాటించారు.
ప్రపంచానికే భారతదేశం ఆదర్శం ..ప్రపంచంలో మేథావులు, సంఘ సంస్కర్తలు ఎక్కువ మంది భారతీయులే